Wednesday, December 25, 2024

కూలిన రెండంతస్థుల భవనం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: రెండంతస్థుల భవనం కూలి ముగ్గురు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం డియోరియా జిల్లాలోని సాదార్ ప్రాంతంలో జరిగింది. గత వారం రోజుల నుంచి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో శిథిలావస్థకు చేరిన భవనాలు కూలిపోతున్నాయి. అన్సారీ రోడ్డు గత రాత్రి రెండంతస్థుల భవనం కూలిపోవడంతో ముగ్గురు చనిపోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సహాయక చర్యలు చేపట్టారు. మృతులు భార్య భర్తలు, కూతురు ఉన్నట్టు గుర్తించామని స్థానిక అధికారి సౌరభ్ సింగ్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News