Monday, December 23, 2024

ఢిల్లీలో కూలిన భవనం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని లాహోరీ గేట్ ప్రాంతం వాల్మీకి మందిర్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున రెండంతస్థుల భవనం కూలిపోవడంతో ముగ్గురు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గత కొన్ని రోజుల ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురవడంతో శిథిలావస్థకు చేరిన భవనాలు కూలిపోతున్నాయి. వాల్మీకి మందిర్ సమీపంలో రెండంతస్థుల భవనం కూలిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయని డిసిపి శ్వేత చౌహాన్ తెలిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న పది మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై 304A, 336, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News