- Advertisement -
న్యూఢిల్లీ: మూడు రఫేల్ యుద్ధ విమానాలు మార్చి 31న భారత్ చేరుకోనున్నాయి. బుధవారం ఉదయం 7 గంటలకు బోర్డాక్స్‌లోని వైమానిక స్థావరం నుంచి రఫేల్ జెట్లు బయలుదేరుతాయని ఫ్రాన్స్‌కు చెందిన తయారీ సంస్థ దసాల్ట్ ఏవియేషన్ తెలిపింది. గల్ఫ్ ఆఫ్ ఒమెన్ మీదుగా ప్రయాణించే సమయంలో యుఎఇకి చెందిన ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌బస్ 330 ద్వారా అవసరమైన ఇంధనాన్ని గాల్లోనే ఈ జెట్లు నింపుకోనున్నాయి. అవి గుజరాత్‌లోని వైమానిక స్థావారానికి రాత్రి 7 గంటలకు చేరుకోనున్నాయి. మూడు జెట్ల రాకతో భారత వైమానిక దళంలో రఫేల్ జెట్ల సంఖ్య 14కు చేరుకోనున్నది. వచ్చే నెలలో మరో 9 రఫేల్ జెట్లు రానున్నాయి. వీటిలో ఐదింటిని బెంగాల్‌లోని హషిమారా వైమానిక స్థావరంలో మోహరిస్తారు.
3 more Rafale jets to arrive in India on March 31
- Advertisement -