Sunday, January 19, 2025

విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు మృతి..

- Advertisement -
- Advertisement -

అమరావతి: కాకినాడలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జగ్గంపేట మండలంలోని రాజపూడిలో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందారు. పామాయిల్ తోటలో విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను బోదిరెడ్డి సూరిబాబు, కిల్లి నాగు, గల్ల బాబీగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News