Monday, December 23, 2024

విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/అమీర్‌పేట: విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. .అనంతపూర్ జిల్లా, హిందూపూర్‌కు చెందిన వెంకటేశ్వ ర్లు కుటుంబం చాలాకాలం క్రితం నగరానికి వచ్చి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ సనత్‌నగర్ జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు.

వెంకటేశ్వర్లు (60)కు భార్య మాధవి (50) కుమారుడు హరికృష్ణ (32) ఉన్నారు. కుమారుడు హరికృష్ణ మానసిక సమస్యతో బాధపడుతూ తన స్వంత పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. దీంతో ప్రతిరోజులాగే మాధవి ఆదివారం కుమారుడిని స్నానం చేయిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. బాత్‌రూమ్ ను ంచి కేకలు వినిపించడంతో తండ్రి వెంకటేశ్వరరావు కూడా లోనికి వెళ్లడంతో అతను కూడా విద్యుత్ షాక్‌తో మృతి చెందాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందినట్టు సమాచారం తెలియడంతో జెక్ కాలనీలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News