న్యూఢిల్లీ: అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. ఆరు జిల్లాల్లోని 94 గ్రామాల్లో వరదల ప్రభావం ఉందని అధికారులు వెల్లడించారు. దిమా హసావ్ జిల్లాలోని 12 గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. హసావో జిల్లాలోని హఫ్లాంగ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి ఆదివారం తెలిపారు. దాదాపు 80 ఇళ్లు దెబ్బతిన్నాయి. అస్సాంలో గత కొన్ని రోజులుగా భారీ కుండపోత వర్షంతో పాటు తుఫాను గాలుల వీస్తున్నాయి. ఈ ఏడాది మొదటి వరదల కారణంగా అస్సాం అతలాకుతలమైంది. అస్సాం, పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయతో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో నదుల నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. కొపిలి నదిలో నీరు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోందని సంబంధిత అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించారు. హోజాయ్, లఖింపూర్, నాగావ్ జిల్లాల్లో వరదల కారణంగా అనేక రోడ్లు, వంతెనలు, నీటిపారుదల కాలువలు దెబ్బతిన్నాయని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వెల్లడించింది.
అసోంను ముంచెత్తిన వరదలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -