Monday, December 23, 2024

చిత్తూరులో రోడ్డు ప్రమాదం: ఎస్ఐతో సహా ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి

- Advertisement -
- Advertisement -

3 police dead in road accident in chittoor

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంజాయి కేసు విచారణలో భాగంగా నిందితుడిని అరెస్టు చేయడానికి వచ్చిన కర్నాటక పోలీస్ వాహనం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఎస్‌ఐతో సహా ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గంజాయి కేసులో నిందితుడిని పట్టుకోవడానికి ఎస్‌ఐ అవినాశ్ తన 8 మంది సిబ్బందితో కలిసి రెండు వాహనాల్లో బెంగళూరు నుంచి తిరుపతికి బయలు దేరాడు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి కొత్తకోట వద్ద రైల్వే బ్రిడ్జి ఎత్తు సూచిక స్తంభాన్ని తప్పించబోయి బ్రిడ్జిని కారు ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు కావడంతో ముందు సీట్లో ఉన్న ఎస్‌ఐ అవినాష్, కానిస్టేబుల్ అనిల్ మల్లిక్, డ్రైవర్ మ్యాక్స్‌వెల్ ఘటనా స్థలంలోని చనిపోయారు. ఈ ఘటనపై కర్నాటక సిఎం బసవరాజు బొమ్మై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News