Wednesday, January 22, 2025

కోల్ కతాలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కోతుల పట్టివేత..

- Advertisement -
- Advertisement -

3 Rare Foreign Monkeys Seized in Kolkata

కోల్ కతా: పశ్చిమ్ బెంగాల్ రాజధాని కోల్ కతాలో రూ.కోటి విలువైన విదేశీ కోతులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బుధవారం కోల్ కతాలోని మైనాగురి హైవేపై బస్సును కస్టమ్స్ అధికారులు అడ్డుకుని తనిఖీ చేశారు. విదేశాల నుంచి అస్సాం మీదుగా బెంగాల్ లోని సిలిగురికి 3 అరుదైన విదేశీ కోతులను కేటుగాళ్లు తరలించేదుకు ప్రయత్నించారు. కస్టమ్స్ అధికారులను చూసి డ్రైవర్ బస్సును వదిలేసి పారిపోయాడు. బస్సులో 3 అరుదైన విదేశీ కోతులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని అటవి అధికారులకు అప్పగించారు. వన్య ప్రాణుల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

3 Rare Foreign Monkeys Seized in Kolkata

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News