Saturday, December 21, 2024

ఫిబ్రవరి నుంచి 3 పథకాలు?

- Advertisement -
- Advertisement -

త్వరలో విధివిధానాలు

ఫిబ్రవరి మొదటివారం నుంచి లబ్ధిదారుల

ఎంపిక ఉచిత విద్యుత్ 200 యూనిట్‌లు,  రూ. 500 లకే సబ్సిడీ సిలిండర్
ఇందిరమ్మ పథకాలు అమలు
విధి విధానాలు త్వరలో వెల్లడించే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చేనెల నుంచి కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీల్లో మరికొన్నింటి ని అమలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అ వుతోంది.అందులో భాగంగా ఉచిత విద్యుత్ (200 యూనిట్‌ల వరకు గృహజ్యోతి పథకం కింద) రూ. 500 లకే సబ్సిడీ సిలిండర్ (మహాలక్ష్మీ పథకం కింద), ఇళ్లు కట్టుకోవడానికి రూ. 5లక్షల మంజూరు (ఇందిరమ్మ ఇంటి పథకం) పథకాలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇప్పటికే మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసి బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణంతో పాటు చేయూత పథకం కింద రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొని మూడు పథకాలను ప్రజల కు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితాను రూపొందించే పనిలో అధికారులు ఉండగా దానిని ఎలా అమలు చేయా లి, ముందుగా ఎంతమంది లబ్ధిదారులకు వాటిని అందచేయాలన్న దానిపై ప్రభుత్వం సమాలోచన లు చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ పథకాలకు సంబంధించి విధి, విధానాలను కూడా త్వరలో ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
ఏప్రిల్ తరువాత మహిళలకు రూ.2500లు..!
గత ప్రభుత్వం హయాంలో గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తులను తీసుకోగా, ప్రస్తుతం ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో దాని స్థానంలో ఇందిరమ్మ పథకం కింద అర్హులకు రూ.5లక్షలను ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే మహాలక్ష్మీ పథకం కింద ప్రతి నెలా మహిళలకు రూ.2500లను వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా దానిని ఏప్రిల్ తరువాత అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
మొత్తం దరఖాస్తులు 4,56,35,666
గతేడాది డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో రూ. 500 సబ్సిడీ ఎల్పీజీ సబ్సిడీ సిలిండర్ల 91.49 ల క్షల మంది, మహిళలకు నెలకు రూ.2500ల పథకానికి 92,23,195 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. దీంతోపాటు ఇందిరమ్మ ఇళ్ల కోసం 82,82,332 మంది దరఖాస్తు చేసుకోగా, 200 యూనిట్‌ల ఉచిత విద్యుత్ కోసం 81,54,158 మంది, 250 గజాల స్థలం కోసం 23,794 మంది, రైతుభరోసాకు (భూమి రైతుకు నెలకు రూ.15 వేలు పథకానికి) 38,73,956 మంది, రైతు భరోసా (కౌలు రైతుకు నెలకు రూ.15 వేలు పథకానికి) 2,63,616 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇలా అన్ని పథకాలకు కలిపి 4,56,35,666 మంది దరఖాస్తు చేసుకున్నారు.
వచ్చేనెల మొదటివారంలో లబ్ధిదారుల ఎంపిక
లోక్ సభ ఎన్నికలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ప్రకటనకు ముందే మూడు పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆరు గ్యారెంటీ అమలు కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మంత్రివర్గ ఉప సంఘం ఫిబ్రవరి మొదటివారంలో లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను రూపొందించిన తర్వాత మహిళలను గుర్తించేందుకు ఇంటింటి పరిశీలన ప్రారంభించాలని రేవంత్ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News