- Advertisement -
స్టాక్‌హోం : రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి (2024) లభించింది. ప్రొటీన్ల డిజైన్లకు సంబంధించిన పరిశోధనలకు గాను శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హసబిస్, జాన్ ఎం. జంపర్‌ను ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. కంప్యుటేషనల్ ప్రొటీన్ డిజైన్‌కు గాను బెకర్, ప్రొటీన్ స్ట్రక్చర్ ప్రిడెక్షన్‌కు గాను డెమిస్, జంపర్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. వైద్యవిభాగంలో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14 వరకు సాగనుంది. సోమవారం వైద్యశాస్త్రంలో , మంగళవారం భౌతిక శాస్త్రంలో, బుధవారం రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాలకు ఎంపికైన వారి జాబితా వెలువడింది. గురువారం సాహిత్య విభాగం సంబంధించి ప్రకటన ఉంటుంది. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి
- Advertisement -