Friday, November 15, 2024

సెంట్రల్ బ్యాంకును మోసగించిన ముగ్గురికి కఠిన కారాగారా శిక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను రూ.1.20 కోట్ల మేర మోసం చేసిన ముగ్గురు వ్యక్తులకు హైదరాబాద్‌లోని సిబిఐ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి వేర్వేరు జైలుశిక్షలు విధించారు.

అప్పటి బ్రాంచ్ మేనేజర్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బొలారం బ్రాంచ్ (హైదరాబాద్) కె. రాజారావుకు రూ. 65,000 జరిమానాతో పాటు, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష (ఆర్‌ఐ) కోర్టు విధించింది. బ్యాంకుకు తప్పుడు పద్ధతిలో నష్టం కలిగించిన కేసులో డి. సంజీవ రెడ్డి ,కె. రమణా రెడ్డి.. ఒక్కొక్కరికి రూ. 15,000 జరిమానాతో ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష (RI) విధించారు. వీరిపై సిబిఐ 2004 జూలై 30న కేసు నమోదు చేసింది.

సరైన గుర్తింపు లేక అర్హత లేకుండా తప్పుడు నివేదికలు, రుణగ్రహీతల సంతకాలను ఫోర్జరీ చేస్తూ 70 మంది రుణగ్రహీతల పేర్లపై రూ.1.29 కోట్ల (సుమారు) హౌసింగ్ లోన్‌లు పొందారు. అందువలన, వారు తప్పుడు ద్రవ్య లాభం పొందారు , సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తప్పు దోవ పట్టించి నష్టాన్ని కలిగించారు.

విచారణ పూర్తయిన తర్వాత, నిందితులపై 2006 మార్చి 31న చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం నిందితులను దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం వారికి శిక్షను ఖరారు చేసింది.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News