Monday, January 20, 2025

అమెరికాలో ఆగని కాల్పుల‌ మోత.. మరో ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో కాల్పుల‌ మోత ఆగడంలేదు. నిన్న ఓ యువకుడు విచ‌క్ష‌ణార‌హితంగా జరిపిన కాల్పుల‌్లో 10మంది నల్లజాతీయులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అమెరికాలో కాల్పుల మోత మోగింది. అమెరికాలోని హ్యుస్ట‌న్ మార్కెట్‌లో ఓ వ్యక్తి కాల్పులు జ‌రిపాడు. ఈ ఘటనలో ఇద్ద‌రు మృతి చెందగా.. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇక, ద‌క్షిణ కాలిఫోర్నియాలోని ఓ చ‌ర్చిలో దుండ‌గుడు జ‌రిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

3 Shot dead and 7 Injured in America

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News