Wednesday, April 2, 2025

అమెరికా నైట్ క్లబ్‌లో కాల్పులు… ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : అమెరికాలోని మిసిసిపిలో నైట్ క్లబ్‌పై ఆదివారం రాత్రి ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఇండియానా లోని చర్చి స్ట్రీట్‌లో ఉన్న నైట్‌క్లబ్‌లో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. మొత్తం 19 మందిపై కాల్పులు జరపగా, ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

16 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈసమాచారం అందుకున్న పోలీస్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. దుండగుడు కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీస్‌లు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News