మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని ప్రాంతంలోని యూనివర్శిటీ ఆవరణలో ఆదివారం ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో పట్టణ మాజీ మేయర్, మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. లా స్కూలులో గ్రాడ్యుయేషన్ వేడుకలకు ముందుగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో గ్రాడ్యుయేషన్ వేడుకలను రద్దు చేశారు. సబర్బన్ క్యూజోన్ నగరం లోని అటెనియో డీ మనీలా యూనివర్శిటీ గేటు దగ్గర కాల్పులు జరిపిన తరువాత రెండు పిస్తోళ్లు కలిగిన దుండగుడు తప్పించుకుని పారిపోడానికి ప్రయత్నించగా, యూనివర్శిటీ గేటు బయట అధికారులు, అక్కడి జనం అడ్డుకోవడంతో పోలీసులు పట్టుకోగలిగారు. దాడికి గల కారణాలను ఏమిటో తెలుసుకోడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిందితుడు ఒక డాక్టర్ అని, లామిటన్ నగర మాజీ మహిళా మేయర్ రోసితా ఫు రిగేతో నిందితునికి దీర్ఘకాలవైరం ఉందని, క్యూజోన్ సిటీ పోలీస్ చీఫ్ జెన్ రేమస్ చెప్పారు. మృతుల్లో మాజీ మేయర్‌తోపాటు ఆమె సహాయకురాలు, యూనివర్శిటీ గార్డు ఉన్నారని అధికారులు తెలిపారు. రోసితా ఫురిగే కుమార్తె కూడా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను క్యూజోన్ నగర మేయర్ జాయ్ బెల్మోంటే ఖండించారు.
3 Shot dead in Philippines University