Sunday, November 17, 2024

భార్యపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని తోటి ఉద్యోగులపై పోలీస్ కాల్పులు… ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని హైదర్‌పూర్ ప్రాంతంలోని వాటర్ ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న సిక్కిం పోలీస్ తోటి ఉద్యోగులపై కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరొకరు తీవ్ర గాయాలతో బిఎస్‌ఎ ఆస్పత్రిలో మృతి చెందాడు. తన భార్యపై ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆగ్రహంతో నిందితుడు కాల్పులకు బరి తెగించాడని తెలుస్తోంది. ఆ తరువాత నిందితుడు ప్రబిన్ రాయ్(32) ఢిల్లీ పోలీస్‌లకు లొంగిపోయాడు. హతులు ఇద్దరూ సిక్కిం పోలీసులే. వీరంతా హైదర్‌పూర్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో భద్రతా విధుల్లో నియామకమయ్యారు.

ఈ కాల్పుల గురించి మధ్యాహ్నం 3 గంటలకు కెఎన్‌కె మార్గ్ పోలీస్ స్టేషన్ కు సమాచారం వచ్చిందని, ఆ సంఘటన ప్రదేశానికి వెళ్లి చూడగా, ఇద్దరు అక్కడికక్కడే చనిపోయి ఉన్నారని, మరొకరిని తీవ్ర గాయాలతో బిఎస్‌ఎ ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు చనిపోయినట్టు చెప్పారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(రోహిణి) ప్రణవ్ తాయల్ వివరించారు. నిందితుడు సమయపూర్ బద్లీ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడని పేర్కొన్నారు. మృతులు కమాండర్ పింటో నంగ్యాల్ భూటియా (2012 బ్యాచ్, నిందితుని బ్యాచే), కానిస్టేబుల్స్ ఇంద్రలాల్ చెత్రి, ధన్‌హంగ్ సుబ్బా(వీరిద్దరూ 2013 బ్యాచ్)గా గుర్తించారు. మృతులు ముగ్గురూ అవాంఛనీయ విషయాలు చెబుతూ నిందితుడ్ని మానసిక వేదనకు గురి చేశారని దర్యాప్తులో బయటపడిందని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేపేంద్ర పాథక్ రాయ్ పోలీసులకు వివరించారు.

3 Sikkim Police shot dead by Colleague in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News