Wednesday, January 22, 2025

ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు విద్యార్థులు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

3 Students killed in Road Accident in Mangalagiri

గుంటూరు: జిల్లాలోని మంగళగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి మంగళగిరి మండలంలోని కృష్ణయపాలెంలో వేగంగా దూసుకువచ్చిన ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు పెనుమాకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

3 Students killed in Road Accident in Mangalagiri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News