Wednesday, January 22, 2025

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వరంగల్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న మార్గంలో వారు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ని ఢీకొట్టింది. వరంగల్ జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు రమ్య, గోపీనాథ్, వారి పిల్లలు సాహిత్, హాసినితో పాటు సమీపబంధువు తారకేశ్వరి బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నారు.

ఈ క్రమంలో సత్యసాయి జిల్లాలోని కనగానపల్లి మండలం పర్వత దేవరపల్లి వద్ద జాతీయ రహదారిపై డివైడర్‌ను కారు ఢీకొట్టడంతో దంపతులిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. వారి బంధువు తారకేశ్వరి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమాదంలో గాయపడిన పిల్లలు సాహిత్, హాసినికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

3 Telangana People killed in Road Accident in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News