Wednesday, January 22, 2025

కశ్మీరులో ముగ్గురు ఉగ్రవాదుల హతం..27 గంటలపాటు సాగిన ఆర్మీ ఆపరేషన్

- Advertisement -
- Advertisement -

జమ్మూ కశ్మీరులోని అఖ్నూర్ సెక్టార్‌లో సైనిక వాహనంపై దాడికి బాధ్యులైన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మంగళవారం హతమార్చాయి. దాదాపు 27 గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్ మంగళవారం ఉదయం ముగిసింది. వాస్తవాధీన రేఖ సమీపంలో ఆర్మీ కాన్వాయ్‌లో భాగమైన అంబులెన్సుపై ఉగ్రవాదులు సోమవారం కాల్పులు జరపడంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. భద్రతా దళాల ఆపరేషన్‌లో సోమవారం సాయంత్రానికి ఒక ఉగ్రవాది అంతం కాగా జోగ్వాన్ గ్రామలోని అస్సాన్ ఆలయం వద్ద మంగళవారం తెల్లవారుజామున భద్రతా దళాల ఎదురు కాల్పులలో మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో బిఎంపి 2 ఇన్‌ఫాంట్రీ కంబాట్ వాహనాలను, ప్రత్యేక దళాలు, ఎన్‌సిజి కమాండోలు పాల్గొనగా వారికి హెలికాప్టర్లు, డ్రోన్లు సహకరించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News