Sunday, December 22, 2024

మణిపూర్‌లో ముగ్గురు గిరిజనుల కాల్చివేత

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్‌లోని కంగ్‌పోక్పీ జిల్లాలోని మంగళవారం ఉదయం ముగ్గురు కుకీ-జో తెగకు చెందిన ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. కంగ్వి ప్రాంతంలోని ఇరెంగ్, కరమ వీఫీ గ్రామాల మధ్య ఈ మెరుపుదాడి జరిగినట్లు అధికారి ఒకరు తెలిపారు.

ఉదయం 8.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తమకు తెలిసిందని, గుర్తు తెలియని సాయుధులు కొందరు ముగ్గురు పౌరులను కాల్చి చంపివేసినట్లు తమకు సమాచారం అందిందని ఆ అధికారి తెలిపారు. ఈ నెల 8వ తేదీన టెంగ్‌నౌపాల్ జిల్లాలోని పల్లెల్ వద్ద హింసాకాండ చెలరేగి ముగ్గురు వ్యక్తులు మరణించగా 50 మందికి పైగా గాయపడిన ఘటనల నేపథ్యంలో తాజా ఘటన జరిగింది.

మణిపూర్‌లో మే 3న ఘర్షణప్రారంభమై అది జాతుల మధ్య వైరానికి దారితీసిన దరిమిలా ఇప్పటివరకు 160 మందికిపైగా మరనించారు. వందలాది మంది గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News