Thursday, January 23, 2025

మూడు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల మూసివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: యమునా నది రికార్డు స్థాయిలో ప్రవహిస్తున్న కారణంగా వరద నీరు ఢిల్లీలోని వజీరాబాద్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోకి చేరుకోవడంతో ఆ ప్లాట్‌ను మూసి వేశారు. దీంతో పాటుగా చందర్‌వాల్, ఓఖ్లాలోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను కూడా మూసి వేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదేశించారు. దీంతో నగరవాసులకు వరద కష్టాలతో పాటుగా తాగు నీటి కష్టాలు కూడా మొదలయ్యాయి.గురువారం వజీరాబాద్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించిన కేజ్రీవాల్ వరద నీరు యంత్రాల్లోకి ప్రవేశించినందున ప్లాంట్‌ను మూసివేసినట్లు తెలిపారు. దీనివల్ల నగర వాసులకు 25 శాతం నీటి సరఫరా తగ్గిపోతుందని తెలిపారు. వరద తగ్గుముఖం పట్టగానే ప్లాంట్లు తిరిగి పని చేస్తాయని కూడా కేజ్రీవాల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News