Thursday, January 16, 2025

చేతబడి… ఒకే ఇంట్లో ఐదుగురు హత్య

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇట్కల్ గ్రామంలో చేతబడి చేస్తున్నరనే నేపంతో ఒకే ఇంట్లో ఐదుగురిని గ్రామస్థులు హత్య చేశారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మౌసమ్ కన్నా(34), మౌసమ్ బిరి(30), మౌసమ్ బుచ్చా(34), మౌసమ్ అర్జో(32), కర్క లచ్చి(43)గా గుర్తించారు.  చేతబడి చేయడంతో తమ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామస్థులు హత్య చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News