Monday, December 23, 2024

గుడిలో తొక్కిసలాట: ముగ్గురు మహిళల మృతి

- Advertisement -
- Advertisement -

సికర్: రాజస్థాన్‌లోని సికర్‌లో సోమవారం తెల్లవారుజామున ఒక ఆలయం వెలుపల జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. గ్యారస్ పురస్కరించుకుని ఖటూ శ్యాంజీ ఆలయం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తెల్లవారక ముందే చేరుకున్నారని, తెల్లవారుజామున 4.30 గంటలకు దర్శనం కోసం ఆలయం తలుపులు తెరుచుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని స్థానిక పోలీసు స్టేషన్ అధికారి రియా చౌదరి తెలిపారు. తొక్కిసలాటలో నలిగి గుండెవ్యాధి గల ఒక 63 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు మహిళలు తొక్కిసలాటలో కిందపడి మరణించారని ఆమె తెలిపారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.

3 Women Killed at Khatu Shyam Temple in Rajasthan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News