Thursday, January 23, 2025

దుప్పట్ల పంపిణీలో తొక్కిసలాట… ముగ్గురు మహిళల మృతి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ బర్దవాన్‌లో బుధవారం దుప్పట్ల పంపిణీలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు గాయపడ్డారు. బీజేపీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత సువేందు అధికారి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనుకున్నదానికంటే ఎక్కువ మంది రావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. సువేందు అధికారి కార్యక్రమంలో పాల్గొని వెనుదిరిగిన వెంటనే తొక్కిసలాట జరిగింది.

అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని అధికార టీఎంసీ ఆరోపించింది. చిన్నవేడుకలో సామర్థానికి మించి ఎక్కువ మందిని తరలించారని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. నిబంధనలు పాటించని సువేందు అధికారి తీరుపై విమర్శలు గుప్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News