Wednesday, January 22, 2025

దంతేవాడలో నక్సల్స్ లొంగుబాటు.. దంపతులు సహా నలుగురు జనంలోకి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిఆ్లలో ముగ్గురు మహిళా నక్సలైట్లు అధికారుల ముందు లొంగిపొయ్యారు. వీరితో పాటు కేడర్‌కు చెందిన మగ వ్యక్తి కూడా సరెండర్ అయినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం నివారించేందుకు 2020 జూన్‌లో నక్సల్స్ అడవులు వీడి, సొంత ఇండ్లకు, గ్రామాలకు రావాలని , వారికి తగు పునరావాసం ఉంటుందని తెలియచేస్తూ లన్ వర్రట్టు పేరిట ఈ జిల్లాలో ఉద్యమం చేపట్టారు. గోండీ భాషలో వారిని ఆ దిశలో ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు పలు పథకాలు చేపడుతూ వస్తున్నారు. నక్సల్స్ సరెండర్ల ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకూ 872 మంది నక్సలైట్లు ఈ ఈ నాలుగు సంవత్సరాలలో ఆయుధాలు వీడారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వచ్చారు.

ఇక ఇప్పుడు సరెండర్ అయిన నక్సల్స్ నలుగురిపై కలిపితే పట్టిస్తే పారితోషికం విలువ రూ 20 లక్షల వరకూ ఉంటుంది. ఇప్పటి సరెండర్ల విషయాన్ని జిల్లా ఎస్ గౌరవ్ రాయ్ మీడియాకు తెలిపారు. ఇప్పుడు లొంగిపోయిన వారిలో దంపతులు కూడా ఉన్నారని వివరించారు. 37 సంవత్సరాల హుంగా టామో అలియాస్ టామో సూర్య , ఆయన భార్య 35 ఏండ్ల అయ్తి తతి కూడా తమ పాత జీవితాలకు స్వస్థిచెప్పారు. అత్యంత శుష్కం, అమానుష రీతిలో మావోయిస్టు సిద్ధాంతాలు ఉన్నాయని . అంతర్గత .ఘర్షణలతో పరిస్థితి దిగజారిందని , వీటిని చూసి తాము విసిగిపోయినట్లు , అందుకే లొంగుబాట పట్టినట్లు పలువురు నక్సలైట్లు ఇప్పుడు తెలిపారు. ఇప్పుడు లొంగిపోయిన వారిలో పలువురు గతంలో పెద్ద ఎత్తున మావోయిస్టుల దాడుల ఘటనల్లో కీలక పాత్ర పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News