Friday, December 20, 2024

బావిలో పేలుడుకు ముగ్గురు కార్మికుల మృతి

- Advertisement -
- Advertisement -

నాసిక్ : మహారాష్ట్ర నాసిక్ జిల్లా హిర్డి గ్రామంలో మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో బావి తవ్వుతుండగా తక్కువ తీవ్రత కలిగిన పేలుడు పదార్ధం పేలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. బావి తవ్వకాన్ని మొత్తం నలుగురు కార్మికులు చేపట్టారు. కొన్ని అడుగుల లోతు తరువాత రాళ్లు తొలగించడానికి తక్కువ తీవ్రత కలిగిన పేలుడు పదార్ధం పేల్చారు. దీంతో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వారు బయటకు వచ్చేలోగా పేలుడు సంభవించింది. రాళ్ల తునకలు వారిని తీవ్రంగా గాయపరిచాయి.

ప్రమాదం తెలిసిన వెంటనే పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా, ముగ్గురు చనిపోయారని వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన నాలుగో కార్మికుడిని జిల్లా కేంద్రం ఆస్పత్రికి తరలించారు. పేలుడు పదార్థం ఉపయోగించే ముందు అనుమతి తీసుకున్నారోలేదో ఇంకా తెలియవలసి ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News