Monday, January 20, 2025

పాత భవనం కూల్చివేస్తుండగా ప్రమాదం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: వరంగల్ నగరంలోని చార్‌బౌళిలో విషాదం చోటు చేసుకుంది. శనివారం పాత భవనాన్ని కూల్చివేస్తున్న క్రమంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పనికోసం వచ్చిన ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. మృతులు ప్రకాష్(32), సునీత(30), జ్యోతి(30)గా గుర్తించారు. భవనం కూల్చుతున్న సమయంలో భవన శిథిలాలు పడి ఈ ముగ్గురు మృతి చెందారు. ఒక్కసారిగా జరిగిన ఘటనతో పనిచేస్తున్న కూలీలు ఊహించని షాక్‌కు గురయ్యారు. కాగా, వెంటనే తేరుకున్న కూలీలు శిథిలాలను తొలగించగా తమతో వచ్చిన ముగ్గురు కూలీలు మృత్యువాత పడడంతో కన్నీరు మున్నీరయ్యారు. భవనం కూల్చివేత కోసం ఒక బృందం కాంట్రాక్ట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. సుమారు 15మంది కూలీలు ఈ పనుల్లో పాల్గొన్నారు. కాగా, ప్రమాద సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

3 Workers killed as old building collapses in Warangal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News