Thursday, December 19, 2024

కారులో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

కారులో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాదం సంఘటన భద్రాద్రి జిల్లాల సాంబాయిగూడెంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఇంట్లో నిద్రిస్తుండగా కారులో ఆడుకునేందుకు వెళ్లిన సాయి నిఖిత అనే చిన్నారి.. కారు డోర్ లాక్‌ కావడంతో అందులోనే చిక్కుకుపోయింది. దీంతో ఉపిరాడక చిన్నారి చనిపోయింది. ఉదయం నిద్రలేచిన తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వెతికారు.

చివరికి కారులో స్పృహతప్పి పడిపోయి ఉన్న చిన్నారిని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News