Saturday, February 22, 2025

హనుమకొండలో విషాదం..

- Advertisement -
- Advertisement -

హనుమకొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. భీమదేవరపల్లి మండలంలోని చంటేయపల్లిలో మంగళవారం ఉదయం స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల బాలుడు శివాన్షు మృతి చెందింది. పెద్ద కుమారుడిని స్కూల్ బస్సు ఎక్కించేందుకు చిన్న కుమారుడు శివాన్షుతో కలిసి తల్లి రోడ్డు మీదకు వచ్చింది. అయితే, ప్రమాదవశాత్తు చిన్న కుమారుడు స్కూల్ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News