Thursday, January 2, 2025

కాలువలో పడి బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

పాల్వంచ  : కాలువలో జారిపడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే … కోదాడకు చెందిన జర్పుల మంజుల మూడు రోజుల క్రితం మున్సిపల్ పరిధి గాజులగూడెంలోని తన పుట్టింటికి వచ్చింది. మృతుడు కుశాల్ (3) అతని అక్కతో కలిసి కిన్నెరసాని నుండి కెటిపిఎస్‌కు వెళ్ళే కాలువ పక్కనుండి వెళుతున్నారు. ఈ క్రమంలో కుశాల్ ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయాడు. వెంటనే అక్క కేకలు వేయటంతో గమనించిన రవి అనే వ్యక్తి కాలువలో దూకి కుశాల్‌ను బయటకు తీశాడు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. తల్లి మంజుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News