Wednesday, January 22, 2025

తల్లి కళ్ల ముందే కొడుకు మృతి

- Advertisement -
- Advertisement -

బిస్కెట్ చిన్నారి ప్రాణం బలిగొన్న ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే.. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పూజా కుమారి మహారాష్ట్ర థానే జిల్లాలోని ఆనంద్ ఆనంద్ నగర్ లో నివసిస్తుంది. కాగా ఆమె అంబరనాథ్ లో ఉన్న ఓ బిస్కెట్ కంపెనీలో పనిచేస్తున్న వారికి లంచ్ బాక్స్ సరఫరా చేస్తుంటుంది. ఈ క్రమంలో మంగళవారం ఆమె లంచ్ బాక్సులు కార్మికులకు ఇవ్వడానికి తన మూడు సంవత్సరాల కొడుకుతో ప్యాక్టరీ కి వెళ్లింది. ఆమె లంచ్ బాక్సులు ఇస్తుండగా ఆయుష్ కి మిషన్ లో కనిపిస్తున్న బిస్కెట్ ముక్కలు

తీసుకొవడానికి వెళ్లగా మిషన్ లో ఉన్న బ్లేడు ఆయుష్ మెడకు చుట్టుకొవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కార్మికులు చికిత్స నిమిత్తం ఆయూష్ ను స్థానిక ఆసుపత్రికి తరలించగా అక్కడ పరిశిలించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అప్పటి వరకు అల్లరి చేస్తూ తిరిగిన కొడుకు తల్లి కళ్లముందే విగతజీవిగా మారడంతో ఆ తల్లి రోదించిన తీరు అక్కడివారిని కలచివేసింది. స్ధానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News