Monday, December 23, 2024

స్కూల్ బస్సులో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

భోపాల్: నర్సరీ చదువుతున్న మూడున్నరేళ్ల చిన్నారిపై స్కూలు బస్సు డ్రైవర్ అత్యాచారం చేశాడు. మధ్యప్రదేశ్‌లో కలకలం రేపిన ఈ ఘటన రాజధాని భోపాల్‌లో జరిగిందని పోలీసులు తెలిపారు. చిన్నారి బాలికపై అత్యాచారానికి పాల్పడిన డ్రైవర్‌ను అరెస్టు చేశామని, చిన్నారిపై అఘాయిత్యం జరిపేందుకు సహకరించిన మహిళను కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. గత వారం ఈ ఘటన జరిగిందని బాధిత బాలిక తల్లిదండ్రులు తెలిపారని పోలీస్ అధికారులు వివరించారు. ఈ విషయాన్ని స్కూలు యాజమాన్యం బయటకు వెల్లడవకుండా చేసేందుకు ప్రయత్నించిందని బాలిక పేరెంట్స్ ఆరోపించారు. అఘాయిత్యంపై స్పందించిన మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ ఘటనపై దర్యాప్తు జరుగుతుందన్నారు. స్కూలు యాజమాన్యం పాత్ర ఉందని తేలితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు. చిన్నారి మాత్రమే ఉన్న సమయంలో అఘాయిత్యానికి పాల్పడిన డ్రైవరు బాలిక బట్టలు మార్చాడు. ఆమె తల్లి బాలికను అనునయించి విచారించగా అత్యాచారం విషయం చిన్నారి తెలిపింది. ఘటన జరిగినపు మహిళా అటెండెంట్ కూడా బస్సులో ఉందని ఆమెపై కూడా కేసు నమోదు చేశామని ఎసిపి నిధి సక్సేనా తెలిపారు.

3 Years Old girl raped by School bus driver in Bhopal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News