Monday, December 23, 2024

జిల్లాలో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

- Advertisement -
- Advertisement -
  • మెదక్ ఎస్పి రోహిణి ప్రియదర్శిని

మెదక్: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెలరోజుల నేటి నుంచి 31 వరకు పాటు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. అలాగే ప్రజాధనాన్ని నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పి హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News