Monday, January 20, 2025

30.65 లక్షల ఇళ్ల స్థలాలకు పట్టాలు: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: 2024 నాటికి అర్హులైన ప్రజలకు శాశ్వత గృహాలు నిర్మిస్తామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేరుకున్నారు. గవర్నర్ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికారు. తొలి సారి ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, నవరత్నాలతో సంక్షేమ పాలన అందిస్తున్నామని, అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని, నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామని వివరించారు. వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామని, అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు వస్తున్నాయన్నారు. మహిళల పేరిట 30.65 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారు.

ప్రతి నెల 1న వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక ఇస్తున్నారని, ప్రతి నెల 64.45 లక్షల మందికి రూ.66,823.79 కోట్లు పెన్షన్లు పంపిణీ చేశామని, వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం కింద నేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు, 81,783 మంది నేత కార్మికులకు రూ.788.5 కోట్టు పంపిణీ చేస్తున్నామని వివరించారు. జగనన్న చేదోడు ద్వారా 3.36 లక్షల మందికి రూ.927.49 కోట్లు జమ చేశామని, వైఎస్‌ఆర్ బీమా కింద రెండేళ్లలో రూ.512 కోట్లుజమ చేశామని వివరించారు. వైఎస్‌ఆర్ వాహన మిత్ర కింద 2.74 లక్షల మందికి రూ.1041 కోట్లు పంపిణీ చేశారని, వైఎస్‌ఆర్ లా నేస్తం ద్వారా 4248 మంది జూనియర్ లాయర్లకు రూ.35.4 కోట్లు పంపిణీ చేశారని చెప్పారు.

జగనన్న తోడు పథకం కింద 15.31 మంది లబ్ధిదారులకు సున్నా వడ్డీకి రూ.2470.3 కోట్లు పంపిణీ చేశామని వెల్లడించారు. అమ్మ ఒడి ద్వారా 80 లక్షల మంది పిల్లలకు ఆర్థిక సాయం చేశామని వివరించారు. ఆర్థిక భారం లేకుండా ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి మండలంలో కనీసం రెండు జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News