Thursday, January 23, 2025

ఆ 30 మంది కార్పొరేటర్లను కాంగ్రెస్‌లోకి వెళ్లమని చెప్పింది నేనే: మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు చెందిన 30 మంది కార్పొరేటర్లను కాంగ్రెస్‌లోకి వెళ్లమని తానే చెప్పానని తెలిపారు. న్యూబోయిన్‌పల్లిలోని సౌజన్యకాలనీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే అక్కడ జరుగుతున్న విషయాలను తనకు తెలియజేయాలని కార్పొరేటర్లకు చెప్పానని వివరించారు. తాము కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోతున్నామని, సీనియర్ నాయకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తరుచూ తనకు ఫోన్లు చేస్తున్నారని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే కాంగ్రెస్‌లోనే ఉంటూ బిఆర్‌ఎస్ గెలుపు కోసం పని చేయాలని ఆ కార్పొరేటర్లకు తాను సూచించానని మల్లారెడ్డి తెలియజేశారు. పార్లమెంటు ఎన్నికల తరువాత ఆ కార్పొరేటర్లు బిఆర్‌ఎస్‌లో చేరుతారని మల్లారెడ్డి వెల్లడించారు.

కాంట్రవర్సీరీకి కేరాఫ్ అడ్రస్ మల్లారెడ్డి. ఆయన ఏది చేసినా హల్ చల్ గా ఉంటుంది. ప్రతిపక్షం లేదా ప్రభుత్వంలో ఉన్న ఆయన జోష్ గా మాట్లాడుతారు. గతంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్‌ను బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మల్లారెడ్డి కలిశారు. ఇద్దరికి పరిచయం ఉండడంతో అప్యాయంగా పలకరించుకున్నారు. మల్కాజ్‌గిరి నుంచి పక్కగా ఈటెల గెలుస్తారని చెప్పడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిఆర్‌ఎస్ పార్టీ ఇరకాటంలో పడింది. బిఆర్‌ఎస్ అధిష్టానం మల్లారెడ్డి వివరణ ఇవ్వాలని అదేశించింది. దీంతో బాగా తెలిసిన వ్యక్తి కావడంతో నవ్వుకుంటా మాత్రమే ఈటలతో గెలుస్తావని చెప్పానని తెలియజేశారు. తాను చెప్పగానే ఈటల గెలుస్తారా? అని సోషల్ మీడియాకు చురకలంటించారు. పక్కగా బిఆర్ఎస్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి విజయం ఖాయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News