Monday, December 23, 2024

జగిత్యాల యువకుడికి జాక్‌పాట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/జగిత్యాల: బతుకు దెరువు కోసం దుబాయి వెళ్లిన ఒక యువకుడికి అక్కడ జాక్‌పాట్ తగిలింది. దినసరి కూలీగా పనిచేసేందుకు వెళ్లిన కరీంనగర్ జిల్లా జగిత్యాకు చెందిన ఆ యువకుడికి ఊహించని విధంగా రూ.30కోట్ల లాటరీ తగిలింది. దాంతో రాత్రికి రాత్రే ఆ యువకుడు కోటీశ్వరుడయిపోయారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూరుకు చెందిన అజయ్ కొన్నేళ్లుగా దుబాయిలో ఉపాధి కోసం వెళ్లి అక్కడే డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

కాగా, అక్కడ భారీస్థాయిలో నిర్వహించే లాటరీలో 30 దిర్హమ్స్‌తో రెండు టికెట్లను కొనుగోలు చేశాడు అజయ్. కాగా, మూడు రోజుల క్రితం డ్రాలో భారత కరెన్సీ ప్రకారం రూ.30కోట్లు జగిత్యాల యువకుడు అజయ్ సొంతం కావడంతో ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. విషయం కుటుంబ సభ్యులకు తెలిసి వారంతా ఆనందంతో మునిగితేలుతున్నారు. ఉపాధికోసం డ్రైవర్‌గా దుబాయ్ వెళ్లిన అజయ్‌కు ఇంతటి అదృష్టం దక్కడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News