Monday, December 23, 2024

ఏప్రిల్ 1 నుంచి 30% క్రిప్టో పన్ను

- Advertisement -
- Advertisement -

30% crypto tax from April 1st

 

న్యూఢిల్లీ : క్రిప్టోకరెన్సీలు, ఇతర వర్చుయల్ అసెట్స్ నుంచి వచ్చే ఆదాయంపై ప్రతిపాదించిన 30 శాతం పన్ను ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని సిబిడిటి(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) చైర్మన్ జె.బి.మోహపాత్ర ప్రకటించారు. దీంతోపాటు ఈ ఆస్తి తరగతుల లావాదేవీలపై 1 శాతం టిడిఎస్ (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) కూడా జూలై 1 నుంచి అమలవుతుందని ఆయన వెల్లడించారు. గత నెలలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2022లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ క్రిప్టో ప్రతిపాదిత పన్నులపై ప్రకటన చేశారు. క్రిప్టోకరెన్సీపై 30 శాతం పన్ను, టిడిఎస్ విధిస్తామని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News