Sunday, December 22, 2024

ఫిలిప్పీన్స్‌లో పడవ బోల్తాపడి 30 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మనీలా : ఫిలిప్పీన్స్‌లోని రైజాల్ ప్రావిన్స్‌లో ఓ ప్రయాణికుల పడవ బోల్తాపడిన ప్రమాదంలో దాదాపు 30 మంది మృతి చెందారు. మరో 40 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. తుపాను గాలులకు పడవ ఊగిపోవడం, భయంతో ప్రయాణికులంతా ఒకవైపుకు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. దేశం లోనే అతిపెద్ద సరస్సు లాగువాలో గురువారం ఓ పడవ , బినన్‌గొనన్ నుంచి తాలిమ్ ద్వీపానికి బయలుదేరింది. అయితే అప్పటికే ఫిలిప్పీన్‌ను డోక్‌సుర అనే టైఫున్ కుదిపోస్తోంది. దీని కారణంగా వీస్తోన్న బలమైన గాలులకు సరస్సు లోని పడవ ఊగిపోయింది. ప్రయాణికులంతా భయంతో ఓ వైపునకు రావడంతో పడవ బోల్తాపడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News