- Advertisement -
అస్సాంలో తీవ్రమైన వరదల కారణంగా ఇప్పటివరకు 30 మందికి పైగా మరణించారు. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది బాధితులయ్యారు. కరీంగంజ్ జిల్లా లోని బదర్‌పూర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడంతో ఒక మహిళ. ఆమె ముగ్గురు కుమార్తెలు, అలాగే మూడేళ్ల బాలుడు సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు. గైనచోర గ్రామంలో మంగళవారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. గత మే నెలలో రెమాల్ తుపాను వల్ల కొండచరియలు విరిగిపడి పలువురు మరణించగా, ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 30 కి చేరుకుంది. గైనచోర గ్రామ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడంతో శిధిలాల నుంచి ఐదు మృతదేహాలను వెలికి తీసినట్టు కరీంగంజ్ జిల్లా ఎస్‌పి తెలిపారు. కరీంగంజ్ లో వరద నీటిలో 152133 మంది కొట్టుమిట్టాడుతున్నారు.
- Advertisement -