Monday, February 24, 2025

ఇరాక్ లో కాల్పులు: 30 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బాగ్దాద్: ఇరాక్‌లోని బాగ్దాద్‌లో తుపాకుల మోత మోగింది. ఆందోళనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో 30 మంది చనిపోయారు. ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో గాయపడినట్టు సమాచారం. షియా తెగ నేత మక్తాదా ఆల్ సదా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. మక్తాదా అనుచరులు, ఫాలోవర్స్, అభిమానులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో ఘర్షణలు శృతి మించడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News