Thursday, December 19, 2024

30 ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలోని దాదాపు 30 పాఠశాలలకు ఈ— మెయిల్ ద్వారా శుక్రవారం బెదిరింపులు అందాయి. దాంతో అనేక దర్యాప్తు సంస్థలు పాఠశాలల ప్రాంగణాల్లో శోధించాయని అధికారులు తెలిపారు. అయితే గాలింపులు జరిపాక ఎలాంటి అనుమానస్పద వస్తువులు లభించలేదని కూడా ఆ అధికారులు తెలిపారు. డిసెంబర్ 9న ఇలాంటి ఈ మెయిల్సే కొన్ని పాఠశాలలకు అందాయి. ఇప్పుడు మళ్లీ ఇలాంటి ఈమెయిల్స్ వచ్చాయి. పోలీసులు ఇవన్నీ ఉత్తుత్తివేనని అన్నారు.ఢిల్లీ పోలీసుకు చెందిన ప్రత్యేక విభాగం దీనికి సంబంధించి కేసు నమోదు చేసింది. బెదిరింపు, కుట్ర కేసును నమోదు చేసింది. అయితే నేరస్థుల సమాచారం విషయంలో ఎలాంటి క్లూ దొరకలేదు. మే నెలలో కూడా 250 పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సంస్థలకు ఇలాంటి బెదిరింపు మెయిల్సే అందాయి. వాటిని ఇంకా పరిష్కరించాల్సి ఉంది.ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారం రోజుల్లో ఇలా బెదిరింపు ఈ మెయిల్స్ రావడం ఇది రెండోసారన్నారు. పిల్లలను ఈ బాంబు బెదిరింపులు ఎంతగా ప్రభావితం చేస్తాయోనని ఆవేదన వ్యక్తం చేశారు.

బాంబు బెదిరింపులు వచ్చిన పాఠశాలలకు అగ్నిమాపక దళాలు, పోలీసు, బాంబ్-డిటెక్షన్ బలగాలు, డాగ్ స్కాడ్స్ హుటాహుటిని వెళ్ళాయి. అవన్నీ మొత్తంగా గాలించాయి. పోలీస్ డిప్యూటీ కమిషనర్(ఆగ్నేయం) రవి సింగ్ పిటిఐ తో మాట్లాడుతూ సెక్యూరిటీ ప్రొటోకాల్ ప్రకారం చెకింగ్ చేశాము. అయితే ఎలాంటి అనుమాన వస్తువులు లభించలేదు. అంతా ఉత్తుత్తి బెదిరింపులే అన్నారు.పరిశోధనలో ఆ ఈమెయిల్స్ విదేశాల నుంచి వచ్చాయని తేలిందని, దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.ఈ మెయిల్స్ అర్ధ రాత్రి 12.54 గంటలకు అందాయని, పంపిన వ్యక్తి పాఠశాలల్లో బాంబులు పేలొచ్చని, ప్యారెంట్‌టీచర్స్ మీటింగ్, స్పోర్ట్ డే కు పిల్లలను పంపొద్దని పేర్కొన్నట్లు సమాచారం. ఈ బెదిరింపు ఈ మెయిల్స్ లో సీక్రెట్ డార్క్ వెబ్ గ్రూప్ హస్తం ఉందని తెలిసింది. పైగా ఈ మెయిల్ పేలుళ్లు శుక్రవారం, శనివారం జరగొచ్చని పేర్కొనడం గమనార్హం. కేంబ్రిడ్జ్ స్యూల్ ప్రిన్సిపల్ మాధవి గోస్వామి ఈమెయిల్ గురించి పోలీసులకు తెలపడంతో వారు పరిశోధన చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News