Sunday, January 19, 2025

భారీగా గంజాయి పట్టివేత.. ఎనిమిది మంది యువకులు అరెస్టు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. గురువారం ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు ట్రావెల్స్ బస్సుల్లో తరలించేందుకు ప్రయత్నించిన 30 కేజీల గంజాయిని గుర్తించిన అదికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎనిమిది మంది గంజాయి గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో అందరూ యువకులే ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారని, హైదరాబాద్ లో గంజాయిని డోర్ డెలివరీ చేసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News