Sunday, December 22, 2024

సూడాన్ మార్కెట్‌పై డ్రోన్ దాడి.. 30మంది మృతి

- Advertisement -
- Advertisement -

కైరో : సూడాన్ రాజధాని ఖర్తోమ్ దక్షిణ ప్రాంతం ఆరుబయలు మార్కెట్‌పై ఆదివారం జరిగిన డ్రోన్ దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంపై మిలిటరీకి, శక్తివంతమైన పారామిలిటరీ గ్రూపుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో భాగంగా ఈ దాడి జరిగింది. మరో 36 మంది గాయపడ్డారు. బషైర్ యూనివర్శిటీ ఆస్పత్రిలో గాయపడిన వారికి చికిత్స చేస్తున్నారు. ఆస్పత్రిలో ఆరుబయట తెల్లని దుప్పట్లు కప్పి ఉంచిన మృతదేహాలు ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడి వెనుక ఏ గ్రూపు ఉందో ఇప్పటికింకా స్పష్టం కావడం లేదు.

సూడాన్‌లో రెండు వర్గాల మధ్య బాంబులు, వైమానిక దాడులు జరగడం సర్వసాధారణం. గ్రేటర్ ఖర్తోమ్ ప్రాంతం రణక్షేత్రంగా ఉంటోంది. గత ఏప్రిల్ నుంచి సూడాన్‌లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. జనరల్ అబ్డెల్ ఫతా బుర్హాన్ నేతృత్వం లోని మిలిటరీకి, జనరల్ మొహమ్మద్ హమ్‌దాన్ డగాలో సారథ్యం లోని పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కు మధ్య ఆధిపత్యపోరు యుద్ధంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News