- Advertisement -
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం హిందూస్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును బస్సు ఢీకొట్టడంతో 30 మంది ఘటనా స్థలంలో మృతి చెందగా మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 70 మంది ప్రయాణికులతో బస్సు సాయిల్ కోట నుంచి రాజన్ పూర్ వెళ్తుండగా దేరా ఘాజీఖాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈద్ ఆల్ అఝా పండుగకు ప్రజలు సొంతూరుకు వెళ్తుండగా వారిని మృత్యువు కబళించింది. పంజాబ్ ముఖ్యమంత్రి ఉస్మాన్ ముజ్ధార్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా రోడ్డు పై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పోలీసులు పక్కకు తొలగించారు.
- Advertisement -