బీజాపూర్ జిల్లాలో 26మంది,
కాంకేర్ జిల్లాలో నలుగురు
మృతి డిస్ట్రిక్ట్ రిజర్వుడ్ గార్డు
బలి మరో ఘటనలోఐఇడి పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు
నక్సల్స్ రహిత భారత్ దిశగా గొప్ప
ముందడుగు: కేంద్ర హోంమత్రి
అమిత్‌షా
మన తెలంగాణ/చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎ దురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఒకేరోజు బీజాపుర్, కాంకెర్ జిల్లాల్లో వేర్వేరు ఎన్‌కౌంటర్లు జరిగా యి. ఈ ఎదురుకాల్పుల్లో బీజాపూర్ డిస్ట్ట్రిక్ రిజర్వ్ గార్డ్ కూడా అమరుడైనట్లు అధికారులు వెల్లడించారు. బీజాపుర్- దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న గంగలూరు పరిధి అండ్రి అడవుల్లో నక్సల్స్ దాగి ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం వచ్చింది.
దీంతో జిల్లాల నుంచి డిఆర్‌జి, సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్ సం యుక్త బలగాలు గురువారం ఉదయం నుంచి అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మా వోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు అ ధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో 26 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం వరకు ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.
ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బీజాపుర్ ఎదురుకాల్పుల్లో ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే సమయంలో కాంకెర్ జిల్లాలోనూ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇక్కడ డీఆర్పీ, బీఎస్‌ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. రెండు జిల్లాల్లోనూ ప్రస్తుతం యాంటీ- నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక్కడ మూడవ సంఘటనలో నారాయణపూర్-దంతెవాడ సరిహద్దులో ఉన్న తులతులి ప్రాంతంలో ఐఈడి పేలుడుతో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.
నక్సలైట్లను మోడీ ప్రభుత్వం నిర్మూలించేస్తుంది: అమిత్ షా
ఛత్తీస్‌గఢ్‌లో 22 మంది నక్సలైట్లను చంపేశాక మోడీ ప్రభుత్వం నక్సల్ విముక్త దేశం వైపుకు వడివడిగా అడుగులేస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం తెలిపారు. నక్సల్స్ విషయంలో మోడీ ప్రభుత్వం నిర్దయగా ముందుకు అడుగులేస్తోందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎవరైతే లొంగిపోవడం లేదో వారి విషయంలో సహించేదే లేదని అన్నారు. ‘నక్సల్ ముక్త్ భారత్ అభియాన్’లో మన సైనికులు మరో విజయం సాధించారని, తాజాగా 22 మందిని వేర్వేరు ఘటనల్లో ఏరివేశారని, 18 మందిని బీజాపూర్ జిల్లాలో, నలుగురిని కంకర్ ప్రాంతంలో ఏరదివేశారని, వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సల్స్ విముక్త దేశాన్ని సాధిస్తామని షా ‘ఎక్స్’లో హిందీ పోస్ట్ పెట్టారు.