Sunday, December 22, 2024

ఛఠ్‌పూజ.. పేలిన సిలిండర్: 30 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

4 Killed after LPG Cylinder blast in Jodhpur

 

మనతెలంగాణ/ పాట్నా: ఛఠ్‌పూజ కోసం వంట చేస్తుండగా సిలిండర్ పేలిన సంఘటన బిహార్ రాష్ట్రం ఔరంగాబాద్ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది పైగా గాయపడ్డారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులలో 25 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శాహ్‌గంజ్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున చఠ్ పూజ కోసం వంటలు చేస్తున్నారు. వంట చేస్తుండగా సిలిండర్ పేలడంతో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సిలిండర్ లీక్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News