Friday, November 22, 2024

నీళ్ల ట్యాంకులో పడి 30 వానరాలు మృతి

- Advertisement -
- Advertisement -

నల్లగొం డ జిల్లా, నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ, ఒకటవ వార్డు పరిధిలోని విజయ వి హార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్‌లో సుమా రు 30 వరకు వానరాలు మృతి చెందాయి. వాటర్ ట్యాంకుపై రేకులు ఉన్న మూత తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లిన వానరాలు బయటికి రాలేక అందులోనే మృతి చెందా యి. తాగు నీటి నుంచి వాసన వస్తుండడాన్ని పలువురు గమనించి మున్సిపల్ అధికారులకు తెలిపారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వానరాల మృతదేహాలు వాటర్ ట్యాంకు నీటిలో తేలి ఉండడాన్ని గమనించారు.

వాటిని వెలికితీసే క్రమంలో చుట్టుపక్కల ఉన్న కోతు లు ఎగబడుతుండటంతో భయబ్రాంతులకు గురయ్యారు. కాగా, వాటర్ ట్యాంక్‌పై మూత ఏర్పాటు చేయాలన్న కనీస జ్ఞానం లేకుండా సంబంధిత అధికారులు, సిబ్బంది ఉండటం ఏంటని ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపాలిటీలో గత కొన్నేళ్ల నుండి కోతుల బెడదతో కాలనీవాసులు భయపడుతున్నారు. కోతులను పట్టుకోవడానికి అడపాదడపా పనులు కాకుండా శాశ్వత పరిష్కారం చేసి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News