- Advertisement -
న్యూఢిల్లీ : ఇన్వెస్టర్ సెంటిమెంట్ మెరుగవ్వడంతో దేశీయ మార్కెట్లలో కొనుగోళ్లు పెరగ్గా, ఈ కారణంగా రూపాయి బలపడుతోంది. బుధవారం భారత్ కరెన్సీ 30 పైసలు పెరిగింది. దీంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.02కు చేరింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుండడం, సానుకూల అంశాలతో రూపాయి పటిష్టమవుతోందని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 82.08 వద్ద మొదలవ్వగా, ఇంట్రాడేలో 81.92 స్థాయికి చేరుకుంది. ఆఖరికి 30 పైసలు లాభపడి 82.02 వద్ద ముగిసింది. అంతకుముందు రోజు సోమవారం నాడు రూపాయి 82.32 వద్ద ఉంది.
- Advertisement -