- Advertisement -
న్యూఢిల్లీ : ఫేస్‌బుక్ యాజమాన్య సంస్థ మెటా ప్లాట్‌ఫామ్ ఉద్యోగ నియామకాల్లో కోతకు ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది సుమారు 30 శాతం మేరకు ఉద్యోగుల భర్తీని తగ్గించాలనుకుంటున్నామని ఫేస్‌బుక్ సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. తీవ్ర ఆర్థిక మాంధ్యం ముప్పు ఉందని, ఎలాంటి సంక్షోభమైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇటీవల చరిత్రలో తాను చూసిన దారుణ పతనాలలో ఇది అధ్వాన్నమైందని ఆయన అన్నారు. 2022లో మెటా సంస్థ ఇంజినీరింగ్ నియామకాలను 7000 వరకు తగ్గించాలని లక్షంగా చేసుకుంది. ఇంతకుముందు 10 వేల మందిని నియమించుకోవాలనుకోగా, ఇప్పుడు మూడు వేల వరకు కోత పెట్టాలని నిర్ణయించిందని సంస్థకు చెందిన ప్రతినిధులు తెలిపారు.
- Advertisement -