న్యూఢిల్లీ: బ్లడ్ ప్రెషర్(బిపి)పై ఐసిఎంఆర్, ఎన్ సిడిఐఆర్, చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ప్రతి 10 మందిలో ముగ్గురు బిపి చెకప్ చేయించుకోలేదు, ముఖ్యంగా 18 నుంచి 54 ఏళ్ల మధ్య ఉన్న వారని ఐసిఎంఆర్ తెలిపింది. ఈ విషయానిన ఇటీవల ప్రచురించిన నివేదికలో పేర్కొంది.
దక్షిణ భారత దేశంలోనే అత్యధికంగా సగటున 76 శాతం మంది బిపి పరీక్ష జీవిత కాలంలో ఒక్కసారైనా చేయించుకున్నారు. లక్షద్వీప్ లో 91 శాతం, కేరళలో 89 శాతం మంది, తమిళనాడులో 83 శాతం మంది బిపి చెకప్ చేయించుకున్నారు. కాగా ఉత్తర భారత దేశంలో 70 శాతం మంది బిపి చెకప్ చేయించుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఎంపీ, ఛత్తీస్ గఢ్, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో బిపి చెకప్ చాలా తక్కువ మంది చేయించుకున్నట్లు వెల్లడయింది.
‘హై బ్లడ్ ప్రెషర్’ అంటే ధమనుల్లో ఉండాల్సిన దానికంటే రక్తపు ఒత్తిడి ఎక్కువ ఉండటం. ఇది గుండె పోటు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి వాటికి దారి తీస్తుందని డాక్టర్లు అంటున్నారు.