Saturday, November 23, 2024

30 శాతం సీట్లు గిరిజనులకే కేటాయించాలి

- Advertisement -
- Advertisement -

10 శాతం గిరిజన రిజర్వేషన్లను పార్లమెంటులో ఆమోదించాలి
కేంద్రానికి మంత్రి సత్యవతి రాథోడ్ వినతి
వర్చువల్‌గా గిరిజన ఫ్రీడం ఫైటర్స్ మ్యూజియం శంకుస్థాపన

మన తెలంగాణ / హైదరాబాద్ : ఇటీవల ములుగులో కొత్తగా మంజూరైన సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటిలో 30 శాతం సీట్లు గిరిజన విద్యార్ధులకే కేటాయించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్, డిఎస్‌ఎస్ భవన్‌లో సోమవారం కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మాత్యులు అర్జున ముండాతో కలిసి రాంజీ మెమోరియల్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియానికి శంకుస్థాపన, డిఎస్‌ఎస్ భవన్‌లో రూ. 6.50కోట్లతో నిర్మించిన ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భవనాన్ని మంత్రి వర్చువల్ గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్ర మంత్రి అర్జున్ ముండా ముందు పలు డిమాండ్లను ఉంచారు. సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగగా గుర్తించి, నిధులను కేటాయించాలని, తెలంగాణ రాష్ట్రానికి అదనంగా మరో 22 ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను మంజూరు చేయాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 10 శాతం గిరిజన రిజర్వేషన్‌లను పార్లమెంట్ లో వెంటనే అమోదించి చట్టం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తూన్న విదంగా దేశమంతటా జనాభా దామాశ ప్రకారం గిరిజన రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. జిఓ నెంబర్ 3 ని చట్టబద్ధం చేయాలని కోరారు. పిఎంపిబిటిజి మిషన్ లో భాగంగా తెలంగాణకు బడ్జెట్ ను కేటాయించి గృహానిర్మణాల ఖర్చు 5 లక్షలకు పెంచాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుకు సంబంధించిన రిప్రెసెంటేషన్ లను కేంద్ర మంత్రి కార్యదర్శి అనిల్ కుమార్‌కు అధికారులతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ స్వయంగా అందజేశారు.

గిరిజన పరిశోధన భవన ప్రారంభోత్సవం
గింజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ నూతన భవనాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖామంత్రి అర్జున్ ముండా, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్చువల్‌గా ప్రారంభించారు. కేంద్ర గింజన వ్యవహారాల శాఖ కార్యదర్శి అనిల్ కుమార్, సహయ కార్యదర్శి నావల్ జిత్ కపూర్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్ చోంగ్తు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జున్ ముండా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, అది ప్రశంసనీయమని అనానరు. కేంద్రం కూడా తెలంగాణలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, ఇక మీదట కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గిరిజన సంక్షేమానికి ఎల్లవేళలా సహకరిస్తుందని చెప్పారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజన పరిశోధన సంస్థ గిరిజన సంక్షేమ శాఖకు గ్యాప్ ఎనాలిసిస్ లో ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. , అలాంటి విశిష్ట సంస్థకు అందమైన భవనం అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా గిరిజన హస్తకళలు, నృత్యాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ కార్యదర్శి- కమీషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు, గిరిజన పరిశోధన సంస్థ సంచాలకులు విట్టా సర్వేశ్వర్ రెడ్డి, ఇంజనీరింగ్, ట్రైకార్, జిసిసి విభాగాల అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News